హైదరాబాద్​ లో మందకొడిగా పోలింగ్

హైదరాబాద్​ లో మందకొడిగా పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా .. మందకొడిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు 9.51కా శాతం పోలింగ్ నమోదు కాగా ...మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40 .38శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. అయితే, ఎప్పటిమాదిరిగానే హైదరాబాద్ లో ఓటు వేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపడం లేదు.. 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. చాలామంది ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడం లేదు.. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్​, మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానాల్ఓ  పోలింగ్ మందకొడిగా సాగుతోంది.. దీంతో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.ఉదయం నుంచి అర్బన్ పార్లమెంట్‌ స్థానాల్లో మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపడంలేదు.

తెలంగాణలో ఎన్నికల వేళ లా అండ్​ ఆర్డర్​  సమస్య ఎక్కడా తలెత్తలేదని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.  పోలింగ్​ చాలా ప్రశాంతంగా జరుగుతుందని... ఎక్కడా మేజర్​ ఇష్యూస్​ రాలేదన్నారు.  ఒకటి , రెండు చోట్ల ఈవీఈఎంలు పనిచేయకపోతే వెంటనే మార్చామన్నారు. మధ్యాహ్నం తరువాత పోలింగ్​ శాతం పెరిగే అవకాశముందని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌  అన్నారు.