
- స్కూల్ కు వెళ్లలేని పిల్లలు, చదువుకోని పెద్దలకు టీచింగ్
- చిన్నారుల నుంచి 80 ఏండ్ల వృద్ధులకు ‘సకీనా’ పాఠాలు
- ప్రాథమిక విద్యనందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ కృషి
- 2022 లో ప్రారంభమవగా ఇప్పటిదాకా 500 మందికి టీచింగ్
హైదరాబాద్, వెలుగు: సిటీలోని స్లమ్స్‌లో స్కూళ్లకు వెళ్లని .. డ్రా పౌట్స్స్టూడెంట్స్ ఎంతోమంది కనిపిస్తుంటారు. కొందరు కుటుంబ కారణాలతో చదువుకు దూరమైన పెద్దవారు ఏదో ఒక పని చేసుకుంటారు. వారికి చదువుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వారికి కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ అయినా అందించాలనే లక్ష్యంతో సకీనా ఫౌండేషన్ ఏర్పాటైంది. 2022లో షేక్‌పేటలోని విరాట్ నగర్ లో ఈవెనింగ్ స్కూల్‌తో ప్రారంభమైంది.
స్లమ్స్ టు ఆక్స్ఫర్డ్ పేరుతో నిర్వహిస్తుంది. ఈవెనింగ్ స్కూల్ ద్వారా చదువుకోని, డ్రా పౌట్ పిల్లలకు చదువు చెబుతుంది. ఇప్పటి దాకా దాదాపు 500 మంది బేసిక్ విద్యను అభ్యసించారు. ఇందులో 70 శాతం మంది స్కూళ్లకు వెళ్లని పిల్లలు ఉండగా 30 శాతం పెద్దలు ఉన్నారు.
కుటుంబ కారణాలే..
స్లమ్స్‌లో ఉండే కొందరు పిల్లలు వివిధ కారణాలతో మధ్యలోనే చదువు ఆపేస్తుంటారు. మరికొందరు.. స్కూల్ ముఖమే చూడరు. ఇంకొందరు బాల కార్మికులుగా పని చేస్తుంటారు. పేరెంట్స్తమ పిల్లలను చదివించపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇందులో ప్రధాన కారణం పేదరికం. దీంతో పిల్లల సంపాదన కూడా కుటుంబ పోషణకు ఎంతో కొంత పనికొస్తుందని పేరెంట్స్ భావిస్తుంటారు. వాళ్లతో పనులు చేయిస్తుంటారు.
ఇలాంటి వారికి ఈవెనింగ్స్కూల్ లో కనీసం ప్రాథమిక విద్యనైనా అందిస్తే చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని సకీనా ఫౌండేషన్ భావించింది. పిల్లలను ఆకర్షించేందుకు గేమ్స్, మ్యూజిక్, డ్యాన్సులు, గిఫ్ట్‌లు ఇవ్వడం వంటివి చేపట్టింది. ఈవెనింగ్స్కూల్లో రాణించిన కొంత మంది స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చి సాధారణ స్కూళ్లలో జాయిన్ చేస్తుంది.
చిన్నారుల నుంచి వృద్ధుల దాకా..
చదువుకోవాలని ఆశయం ఉండాలనే కానీ వయసుతో పనేముంది. ఇదే ఆలోచనతో.. సకీనా ఫౌండేషన్8 నుంచి 80 ఏండ్ల వృద్ధుల వరకు చదువు చెబుతుంది.
రెండేండ్లు ఇంట్లోనే ఖాళీగా..
కరోనా టైమ్‌లో స్కూల్ మధ్యలోనే ఆపేశా. ఆ తర్వాత రెండేండ్లు ఇంట్లోనే ఖాళీగా ఉన్నా. మా పేరెంట్స్ స్కూల్ కు పంపలేదు. ఈవెనింగ్స్కూల్గురించి తెలుసుకొని జాయిన్ అయ్యా. రాయడం, చదవడం చేస్తున్నా.
– మునాజా ఫాతిమా
నేనే చదువు చెప్తున్నా..
నేను ఇండ్లలో పని చేస్తా. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఐదో తరగతి. మరొకరు ఆరో తరగతి. నాకు కూడా చదువుకోవాలని ఉండేది. ఇక్కడ చేరాక తెలుగు, ఇంగ్లీషు రాయడం, చదవడం నేర్చుకున్నా. ఇంట్లో మా పిల్లలకు నేనే చదువు చెప్తున్నా. – కె. మధులత
చదువుతోనే అన్ని సమస్యలకు చెక్
అన్ని సమస్యలకు చదువు ఒక్కటే పరిష్కారమని మా నాన్న చెప్పేవారు. చదువొస్తే.. ఎక్కడైనా బతకవచ్చు అనేవారు. అందుకే నా కూతురు పేరుమీద ఫౌండేషన్ స్థాపించి ప్రాథమిక విద్యనందిస్తున్నా. ఫౌండేషన్ ను స్థాపించి 600 రోజులు పూర్తయింది. దీన్ని విస్తరిస్తే వారి సంఖ్య పెరిగే చాన్స్ ఉంది. ఫ్యూచర్ లో చాలా ప్రాంతాలకు ఈవెనింగ్స్కూళ్లను విస్తరిస్తం.
– మహమ్మద్ ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్, సకీనా ఫౌండర్