హైదరాబాద్‌‌‌‌లో క్వారకల్‌‌‌‌-ఐకామ్‌‌‌‌ వెపన్స్ ప్లాంట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌లో క్వారకల్‌‌‌‌-ఐకామ్‌‌‌‌  వెపన్స్ ప్లాంట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: చిన్న ఆయుధాలను తయారు చేసే ప్లాంట్‌‌‌‌ను  మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్, యూఏఈ కంపెనీ క్వారకల్‌‌తో కలిసి  సోమవారం ప్రారంభించింది. ఐకామ్‌‌‌‌కు ఉన్న ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌లో దీనిని ఏర్పాటు చేశారు.  ఐకామ్ టెలీ లిమిటెడ్ ఎండీ సుమంత్ పాతూరు, క్యారకల్ సీఈఓ హమద్ అల్ అమెరి సంయుక్తంగా ప్రారంభించారు.  

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌లో భాగంగా ఇక్కడ తయారయ్యే  ఆయుధాలు భారత సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( సీఏపీఎఫ్​ఎస్‌‌‌‌), సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, ఎస్‌‌‌‌పీజీ  వంటి సంస్థలకు సప్లయ్ చేస్తారు. ఇక్కడ తయారైన  ఆయుధాలను క్వారకల్‌‌ ఎగుమతి  చేస్తుంది.  ఈ యూఏఈ సంస్థ ఇండియాకు తొలిసారిగా చిన్న ఆయుధాల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. క్యారకల్ హైదరాబాద్‌‌‌‌లో ఉన్న ఐకామ్ కేంద్రంలో వివిధ రైఫిల్స్‌‌‌‌ను,  స్నైపర్ రైఫిల్స్‌‌‌‌ను,  గన్‌‌‌‌లను తయారు చేస్తుంది.