అశ్వారావుపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడగా, చిన్న చిన్న వంతెనలు, చెరువులు కొట్టుకుపోయాయి. వరద నీరు రోడ్లపై పొంగి పొర్లి భారీగా గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చాల్సిన అధికారులు మాత్రం అలాగే వదిలేశారు.
మండలంలోని అనంతారం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద, బ్రిడ్జి వద్ద భారీగా గుంటలు పడ్డాయి. వీటికి ఆర్ అండ్ బి అధికారులు ఎటువంటి ప్రమాద సూచికలను ఏర్పాటు చేయలేదు. వాహనదారులు అదమరిచి వస్తే ప్రమాదం తప్పేలా లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.