రేపు (అక్టోబర్ 20) రాహుల్ గాంధీ టూర్లో స్వల్ప మార్పు

తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి. 2023 అక్టోబర్ 20వ తేదీన ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ మొదటి విడత బస్సుయాత్ర ముగియనుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీకి ముఖ్యమైన సమావేశం ఉండడంతో నిజామాబాద్ లో సభ వాయిదా పడినట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత హైదరాబాద్ రానున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. 

ఇవాళ  పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన బస్సు యాత్రలో రాహుల్‌ పాల్గొన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని చెప్పిన రాహుల్..  . కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.   బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు.  దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందంటేటూ తీవ్ర ఆరోపణలు చేశారు .  ఈ ఎన్నికలు దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణ మధ్య  జరగనున్నాయన్నారు.