
లక్నోలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ లేదా సీఏ/ సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.90,000 జీతం చెల్లిస్తారు.
సెలెక్షన్: ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లు డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. వివరాలకు www.sidbi.in వెబ్సైట్లో సంప్రదించాలి.