
న్యూఢిల్లీ: బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 2024–25 ఆర్థిక సంవత్సరాన్ని లాభాల్లో ముగించాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెరిగినా, చివరిలో నష్టాలు చవి చూశాయి. అయినప్పటికీ 8 శాతం మేర లాభం పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో ఇవి దూసుకెళ్లి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి. వాల్యుయేషన్లు బాగుండటం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3,471.79 పాయింట్లు (ఎనిమిది శాతం), మిడ్‌క్యాప్ ఇండెక్స్2,209 పాయింట్లు (5.61 శాతం) పెరిగాయి.
బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మాత్రం 3,763.57 పాయింట్లు (5.10 శాతం) పెరిగింది. గత అక్టోబరు నుంచి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు భారీగా తగ్గినా, మార్చిలో మాత్రం పుంజుకున్నాయని లెమన్ మార్కె ట్స్ డెస్క్ ఎనలిస్ట్ సతీశ్ చంద్ర ఆలూరి అన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్లు పెరగడం, డొమెస్టిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్బలంగా మారడం, వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఇవి ర్యాలీ చేశాయని వివరించారు.
ఎఫ్ఐఐలు భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్లను తరలించడం, ఈక్విటీల వాల్యుయేషన్స్ఎక్కువగా ఉండటం వల్ల ఫిబ్రవరి వరకు ఇండెక్స్‌లు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. బడా రిటైల్ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించి గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లు భారీగా నష్టపోకుండా నిలువరించగలిగారు. మార్చి నెలలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 4,216.82 పాయింట్లు (5.76 శాతం) పెరిగింది. గత నెలలోనే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 3,555.23 పాయింట్లు (8.25 శాతం), మిడ్‌క్యాప్ ఇండెక్స్ గత 2,939.1 పాయింట్లు (7.61 శాతం) పెరిగింది.
ఇక ముందు కూడా...
గ్లోబల్ మార్కెట్ల నుంచి ఇబ్బందులు వచ్చినా గత ఆర్థిక సంవత్సరంలో మన మార్కెట్లు నిలదొక్కుకున్నాయని హైబ్రో సెక్యూరిటీస్ ఫౌండర్తరుణ్ సింగ్చెప్పారు. సెన్సెక్స్12 నెలల్లో ఐదు శాతం మాత్రమే పెరగడం నిరాశ కలిగించిందని అన్నారు. ఇకముందు కూడా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లు లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లకు మించి రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. గత కొన్ని నెలల్లో కంపెనీలు ఊహించినంత లాభాలు సంపాదించలేకపోయాయి. షేర్ల ధరలు మాత్రం పెరిగాయి.
క్రమంగా మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. అమెరికా టారిఫ్వార్ వల్ల కూడా మార్కెట్ ప్రభావితమైంది. కంపెనీల లాభాలు పెరగకపోవడం వల్ల, మార్కెట్ పెద్దగా రాబడులను ఇవ్వలేకపోయింది. రాబోయే క్వార్టర్లో కంపెనీల రిజల్ట్స్‌ను బట్టి స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ల పనితీరు ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్రికవరీ అయ్యేలా కంపెనీల ఫలితాలు ఉంటాయా లేదా అన్నది ఇప్పుడు ముఖ్యమైన విషయమని వివరించారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఈక్విటీ మార్కెట్లలో గ్రోత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సవాళ్లు కూడా ఎదురవుతాయని స్పష్టం చేశారు. 2023-–24 ఆర్థిక సంవత్సరంలో, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 15,013.95 పాయింట్లు (62.38 శాతం) పెరిగింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 16,068.99 పాయింట్లు (59.60 శాతం) పెరిగింది. సెన్సెక్స్ 14,659.83 పాయింట్లు (24.85) శాతం లాభపడింది.