
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ప్రోగ్రామ్ల కింద తెలంగాణ రాష్ట్రంలోని అనేక నగరాలు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నియమించబడ్డాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ దేశ వ్యాప్తంగా 100 నగరాలను (109 నగరాలకు సవరించారు) అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ పునరుద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమం. ఆయా నగరాల్లోని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మిషన్ను అమలుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతమున్న మధ్యతరహా నగరాలను ఆధునికీకరించడం ద్వారా 100 స్మార్ట్ సిటీలను పెద్ద నగరాల ఉపగ్రహ పట్టణాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీలు ఉన్నాయి.
అమృత్ నగరాలు
అమృత (అటల్ మిషన్ ఫర్ రిజువేనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015, జూన్లో ప్రారంభించారు. ఈ పథకం పట్టణ మార్పు కోసం పటిష్టమైన మురుగునీటి నెట్వర్క్లు, నీటి సరఫరా లక్ష్యంగా ఉంది. అమృత్ కింద రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించిన తొలి రాష్ట్రం రాజస్తాన్. తెలంగాణ రాష్ట్రంలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో 12 అమృత్ నగరాల్లో నీటి సరఫరా పెంచేందుకు ప్రణాళికను సమర్పించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్,
మిర్యాలగూడ, సిద్దిపేట.