బ్యాటరీ బ్యాకప్ కోసం.. స్మార్ట్​ బ్యాటరీ కేస్

బ్యాటరీ బ్యాకప్ కోసం.. స్మార్ట్​ బ్యాటరీ కేస్

యాపిల్ ఫోన్ యూజర్లకు ఉండేప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్.ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తేయాపిల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ. త్వరగా బ్యాటరీ అయిపోతుండటంతో ఎక్కువసార్లు పవర్ బ్యాంక్ లపై ఆధారపడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా యాపిల్ సంస్థ ‘స్మార్ట్ బ్యాటరీ కేస్’ లను రూపొందించిన సంగతి తెలిసిందే.

ఐ ఫోన్ 6, 6ఎస్ ల కోసం స్మార్ట్ బ్యాటరీకేస్ లను రూపొందించిన యాపిల్, ఐ ఫోన్ ఎక్స్‌‌ మ్యాక్స్, ఎక్స్‌‌ఎస్ఆర్ ల కోసం కూడా బ్యాటరీ కేస్ లను తయారు చేసింది. దాదాపు పన్నెండు వేల రూపాయల ధరకలిగిన కొత్త బ్యాటరీ కేస్ లు ఫోన్ కు ఎక్కువ గంటలు బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయి.

కొన్ని మార్పులు
పాత స్మార్ట్ బ్యాటరీ కేసులతో పోలిస్తే కొత్తగా విడుదలైన వాటిలో కొన్ని మార్పులు చేశారు. బయటివైపు సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్ తో, లోపలివైపు మైక్రో ఫైబర్ తో వీటిని తయారుచేశారు. దీని వల్ల కేస్ లోపల ఫోన్ చాలా శుభ్రంగా, సురక్షితంగా ఉంటుంది. అయితే కొత్త వెర్షన్ కాస్త బరువుగా ఉంది. స్మార్ట్ బ్యాటరీ కేస్ కు ‘డెడికేటెడ్ లైట్ నింగ్ పోర్ట్’ ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ కేస్, ఐఫోన్… రెండింటినీ ఒకేసారి చార్జ్ చేసుకునే వీలుంది. కానీ, దీనిలో ఐ ఫోన్ మొదట చార్జ్అయితే, బ్యాటరీ కేస్ తర్వాత చార్జ్అవుతుంది. రెండింటినీ ఫాస్ట్ గా చార్జ్ చేసేందుకు యూఎస్ బీ–పీడీ (పవర్ డెలివరీ)ని సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం యాపిల్ ఫాస్ట్ చార్జర్, యూఎస్ బి–సి కేబుల్ కావాలి. బ్యాటరీకి సంబంధించిన సమాచారం లాక్ స్క్రీన్ మీద, బ్యాటరీ విడ్జెట్ పై కనిపిస్తుంది.

బ్యాటరీ లైఫ్
‘స్మార్ట్ బ్యాటరీ కేస్’ వాడితే ఫోన్ బ్యాటరీ కెపాసిటీ వంద శాతం పెరుగుతుంది. బ్యాటరీ కేస్ వాడితే ముందుగా కేస్ లోని చార్జింగ్ ను ఫోన్ వినియోగించు కుంటుంది .అది పూర్తిగా అయిపోతే అప్పుడు ఫోన్ బ్యాటరీ వాడుకుంటుంది. దీని వల్ల సాధారణ వినియోగంలో ‘ఐ ఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్’ 38గంటలు పని చేస్తే, ‘ఐ ఫోన్ ఎక్స్ ఆర్’ 42 గంటలు పని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. రోజులో ఎక్కువ సమయం ఐ ఫోన్ తో గడిపే వాళ్లకు ‘స్మార్ట్ బ్యాటరీ కేస్’ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆండ్రాయిడ్ తో ఎయిర్ పాడ్స్​2
ఇటీవల యాపిల్ విడుదల చేసిన ‘ఎయిర్ పాడ్స్ 2’ను ఆండ్రాయిడ్ ఫోన్లకూ వినియోగించుకోవచ్చు. వైర్ లెస్ ఇయర్ బడ్స్ లో ఎయిర్ పాడ్స్ కన్నా ఎక్కువ మందిని ఆకట్టుకున్న ఉత్పత్తి మరోటి లేదు. అందువల్ల మ్యూజిక్ లవర్స్ వీటికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర బ్లూ టూత్ డివైజ్ లకు మల్లే ఎయిర్ పాడ్స్ ను కూడా ఆండ్రాయిడ్ ఫోన్లతో సింపుల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఎయిర్ పాడ్స్ పై డబుల్ ట్యాప్ చేయడం వల్ల ప్లే అవుతున్న సాంగ్ ను స్కిప్ చేసి, మరో సాంగ్ కు వెళ్లొచ్చు. సింగిల్ ట్యాప్ చేయడం వల్ల పాజ్ లేదా ప్లే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే, ఎయిర్ పాడ్స్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లు ఆండ్రాయిడ్ పై పని చేయవు. కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా యాపిల్ కోసమే రూపొందాయి. వీటికోసం ఆండ్రాయిడ్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది . ఇదేమీ అంత సులభం కాదు.

 

ఎక్స్‌‌ గూగుల్ చెప్పేస్తుంది!
గూగుల్ ఫొటోస్ లో మీ మొబైల్ లోని ఫొటోలు, వీడియోలు ఏవి బ్యాకప్ అయ్యాయో, ఏవి కాలేదో అనే అనుమానంఉందా? అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే బ్యాకప్ కానీ ఫొటోలు, వీడియోల్ని గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ చెప్తుంది. గూగుల్ ఫొటోలకు సంబంధించిన తాజా అప్ డేట్ లో ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం యూజర్లకు గ్యాలరీలో ఫొటోలు, వీడియోల పక్కన బ్యాకప్ అయిందో లేదో ఒకప్రత్యేక ఇండికేటర్ ద్వారా సూచిస్తుంది. దీనివల్ల ఏదైనా బ్యాకప్ అవ్వని ఫైల్ ను అవసరమనుకుంటే మాన్యువల్ గా బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు. ‘శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్,  హువావీ మేట్ టెన్ ’ ఫోన్లలోనూ ఈ ఫీచర్ పని చేస్తుందని గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫొటోస్ యాప్ కు మెటీరియల్ థీమ్ డిజైన్ ను కంపెనీ అప్ డేట్ చేస్తోంది.ఈ అప్ డేట్ తర్వాత ‘గూగుల్ ఫొటోస్’ బ్యాకప్ అప్ డేట్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది కంపెనీ. ఇటీవలే గూగుల్ ఫొటోలు క్యాప్చర్, క్రాప్ చేసేందుకు వీలుగా ప్రత్యేక టూల్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.