కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీ పనుల కోసం ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఎంపీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆరోపించారు. తాను ఒత్తిడి తేవడంతో ఇటీవల ఈ నిధులు ఇచ్చినా మ్యాచింగ్ గ్రాంట్మాత్రం ఇవ్వలేదన్నారు. సిటీలను స్మార్ట్గామార్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో స్కీమ్ నీరుగారిపోతోందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి హరదీప్ సింగ్ పూరి తో ఆయన గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మంత్రికి వివరించారు. స్మార్ట్ సిటీ స్కీమ్ కింద కరీంనగర్, వరంగల్ లకు ఒక్కో దానికి రూ. 196 కోట్ల చొప్పున కేంద్రం ఫండ్స్ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో తాను నిధుల దారి మళ్లించడంపై నిలదీయగా రాష్ట్ర అధికారులు నీళ్లు నమిలారని చెప్పారు. ఇటీవల ఆ నిధుల్ని విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను మాత్రం రిలీజ్ చేయలేదన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లేదని, ప్లానింగ్ లేకుండానే పనులు చేస్తున్నారని చెప్పారు.
దారి మళ్లిన ‘స్మార్ట్’ ఫండ్స్
- తెలంగాణం
- December 24, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
- Jasprit Bumrah: బుమ్రాను వరించిన ఐసీసీ అవార్డు.. స్మృతి మంధానకు నిరాశ
- 2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- పసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
- ఒక్క రోజు ఏంటి బాస్.. ఇలా చేస్తే ప్రతి రోజూ పండుగే..!
- పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్: కేంద్రమంత్రి బండి సంజయ్
- జనవరి 9వ తేదీ ఇంత దరిద్రమైన రోజా.. ఆ రోజు ప్రపంచంలో ఏం జరిగిందంటే..?
- నార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?
Most Read News
- గుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
- అదొక చెత్త ఎయిర్లైన్స్.. పండగ ఆనందం లేకుండా చేశారు: SRH ఓపెనర్
- Sankranthiki Vasthunnam Movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి
- ర్యాపిడో డ్రైవర్ కి అమ్మాయి పరిచయం.. చర్చిలో పెళ్లి.. హైదరాబాద్ లో అరెస్ట్.. ఏం జరిగిందంటే..?
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు
- ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు
- ఎక్కడి పనులు అక్కడే.. నాలుగు రోజుల్లో మల్లన్న మహా జాతర ప్రారంభం
- రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్