- ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ టౌన్, వెలుగు : స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఈనెల 24న కేంద్ర,రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిటీలోని డంపింగ్ యార్డు, స్పోర్ట్స్ క్లబ్, మల్టీ పర్పస్ పార్కు, 24/7 వాటర్ సప్లై పైలెట్ ప్రాజెక్టు, స్మార్ట్ ఇ క్లాస్ రూమ్స్ తదితర పనులను మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సక్సెస్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేయర్ మాట్లాడుతూ బల్దియా పాలకవర్గ పదవీకాలం ఈ నెలతో ముగుస్తోందని, తమ హయాంలో ఇప్పటివరకు చేపట్టిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.