ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ పై గూగుల్ అసిస్టెంట్పని చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్‌ను రెగ్యులర్‌గా మొబైల్ ఫోన్లో మెసేజెస్ చదవడం, మ్యూజిక్ ప్లే చేయడం వంటి పనులకే కాకుండా స్మార్ట్డివైజెస్ను కంట్రోల్ చేసేందుకు కూడా వాడొచ్చు. గూగుల్ అసిస్టెంట్‌ను ‘గూగుల్ హోమ్ మిని, గూగుల్ హోమ్ మ్యాక్స్, గూగుల్ హోమ్ హబ్, గూగుల్ నెక్ట్స్హబ్ మ్యాక్స్ తోపాటు థర్డ్‌పార్టీ డివైజెస్ అయిన ‘సోనోస్ వన్స్పీకర్, టిక్వాచ్ఈ2’ వంటి డివైజ్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గా వస్తున్న ‘ఫిలిప్స్ హ్యూ లైట్బల్బ్స్, రోబో వ్యాక్యూమ్స్, నెస్ట్థర్మోస్టాట్–ఈ, నెస్ట్ క్యామ్ ఐక్యూ’ వంటి స్మార్ట్‌గ్యాడ్జెట్స్ ను కూడా గూగుల్ అసిస్టెంట్ తో కంట్రోల్ చేయొచ్చు. |
వీటిని గూగుల్ అసిస్టెంట్‌తో కనెక్ట్ చేయాలంటే యాప్ ఓపెన్‌చేసి, ‘యాడ్’పై ట్యాప్ చేయాలి. తర్వాత ‘సెటప్ డివైజ్’> ‘సెటప్ న్యూ డివైజెస్’ > లొకేషన్సెలెక్ట్ చేసుకుని ‘నెక్స్ట్’పై ట్యాప్ చేసి, మిగతా స్టెప్స్ కంప్లీట్ చేయాలి. అంతే మీకు కావాల్సిన స్మార్ట్ డివైజెస్ కనెక్టవుతాయి. దీంతో గూగుల్ అసిస్టెంట్ ద్వారా ‘టర్న్ ఆఫ్ లైట్స్, టర్న్ డౌన్ థర్మోస్టాట్, ‘షో ద ఫ్రంట్ డోర్ కెమెరా’ వంటి కమాండ్స్ తో డివైజెస్‌ను ఆపరేట్ చేయొచ్చు.