స్మార్ట్​ మీటర్ ​టెండర్​ రద్దు

స్మార్ట్​ మీటర్ ​టెండర్​ రద్దు

అదానీకి తమిళనాడు ప్రభుత్వం షాక్​

చెన్నై: తమిళనాడు పవర్​ డిస్ట్రిబ్యూషన్​ కార్పొరేషన్, ​అదానీ ఎనర్జీ సొల్యూషన్స్​ లిమిటెడ్​(ఏఈఎస్​ఎల్​)కు ఇచ్చిన స్మార్ట్​ మీటర్​ కాంట్రాక్టును రద్దు చేసింది. ఏఈఎస్​ఎల్ కోట్ ​చేసిన ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కేంద్రం సవరించిన డిస్ట్రిబ్యూషన్​ సెక్టార్ ​స్కీమ్​ కింద గత ఆగస్టులో నాలుగు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచారు. ఒకటో ప్యాకేజీకి ఏఈఎస్​ఎల్ లోయెస్ట్​ బిడ్డర్​గా నిలిచింది.

దీని కింద చెన్నై సహా ఎనిమిది జిల్లాలకు 82 లక్షల స్మార్ట్​మీటర్లను అమర్చాల్సి ఉంటుంది. అయితే ఏఈఎస్​ఎల్ కోట్​చేసిన ధరలు ఎక్కువగా ఉండటంతో గత నెల 27న టెండర్ ​రద్దు చేసినట్టు కార్పొరేషన్ ​ప్రకటించింది. మరోసారి టెండర్లను పిలిచే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియాలో సోలార్​పవర్​కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూపు రూ.2,100 కోట్ల లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో కేసు నడుస్తున్న సమయంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.