టెక్నాలజీ : వాట్సాప్​లో లాక్​డౌన్​ మోడ్​

టెక్నాలజీ : వాట్సాప్​లో లాక్​డౌన్​ మోడ్​

స్మార్ట్​ ఫోన్​ ఉన్నవాళ్లు వాట్సాప్​ వాడకుండా ఉండరు. మెసేజ్​లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అంటూ మరెన్నో అవసరాలకు వాడుతుంటారు. అలాంటప్పుడు జాగ్రత్త కూడా అవసరమే కదా. వాట్సాప్​ అకౌంట్​ వాడేవాళ్లు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. టూ – ఫ్యాక్టర్డ్​ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయాలి. అంటే సెక్యురిటీ పిన్ సెట్ చేయాలి. వాట్సాప్​లో ఓటీపీ షేర్ చేయొద్దు.  కాల్​ ఫార్వార్డింగ్ ఆఫ్​ చేయాలి. అందుకోసం నెట్​వర్క్ ప్రొవైడర్​ని కాంటాక్ట్ చేయాలి. వాట్సాప్​ వెబ్​ లాగ్​ అవుట్ అయ్యారో లేదో చెక్​ చేసుకుంటూ ఉండాలి. ఐఫోన్​ యూజర్లు లాక్​డౌన్​ మోడ్​ని యాక్టివేట్​ చేయాలి. ఈ మోడ్​ ఆన్​లో ఉంటే అన్-–అఫీషియల్ డివైజ్ లింక్​ను అలో చేయదు. తెలియని నెంబర్లతో కాల్ మెర్జ్ చేయకూడదు.