12GB ర్యామ్ తో సామ్ సంగ్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

12GB ర్యామ్ తో సామ్ సంగ్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

త్వరలోనే ఫోల్డబుల్ (మడతపెట్టే) స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది సామ్ సంగ్. ఇందుకు సంబంధి పలు టెస్ట్ లు చేసి, సక్సెస్ అయినట్లు ఓ వీడియో రిలీజ్ చేసింది సామ్ సంగ్.  పదో యానివర్సరీ సందర్భంగా ఫోల్డబుల్ (మడతపెట్టే) స్మార్ట్ ఫోన్‌ ను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. వరల్డ్ వైడ్ గా ఈ ఫోన్‌ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ ను ఎక్కువసార్లు ఫోల్డ్ చేస్తే పాడైపోదా అనే అనుమానాలు ఎందరిలోనే ఉన్నాయి. ఈ అనుమానాలను అన్నింటిని సామ్‌సంగ్ నివృత్తి చేసే ప్రయత్నాలు చేసింది. ఫోల్డబుల్ మొబైల్ ఫోన్‌ పై టెస్ట్ నిర్వహించి సక్సెస్ అయ్యిందని తెలిపింది. ఈ వీడియో 34 సెకన్ల పాటు ఉంది. 2 లక్షల సార్లు ఈ ఫోన్‌ ను మడతపెట్టినా బాగానే పని చేస్తుందని శామ్‌సంగ్ చెప్పింది.

అంటే రోజుకు వందసార్లు చొప్పున అయిదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోన్ ఉపయోగించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. శామ్‌ సంగ్ పోల్డబుల్ ఫోన్‌ ను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర  రూ.2వేల డాలర్లు. ఈ మొబైల్ ఫీచర్స్… 7.3 అంగుళాల డైనమిక్‌ ఆమోల్డ్‌ మెయిన్‌ డిస్‌ప్లే, ఆరు అంగుళాల HD ప్లస్ సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ ప్లే, స్నాప్ డ్రాగన్‌ 855 ప్రాసెసర్, 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌, బ్యాక్ 3 కెమెరాలు 12 (టెలిఫోటో)+12+(వైడ్‌యాంగిల్‌), 16మెగాపిక్సెల్‌ (అల్ట్రావైడ్‌), ఫంట్ర్‌ డ్యుయల్‌ కెమెరా 10+8 మెగా పిక్సెల్, ఆండ్రాయిడ్‌ పై, 4380 MAH బ్యాటరీ.