ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ వాడినా రెగ్యులర్‌గా చార్జింగ్ పెడుతూ ఉండాల్సిందే. బ్యాటరీలో చార్జింగ్ ఉంటేనే వాచ్ పని చేస్తుంది. ఇందుకోసం రోజూ వీలున్నప్పుడల్లా చార్జింగ్ పెట్టుకోవాలి. అయితే ప్రత్యేకించి చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేని స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. మ్యాట్రిక్స్ ఇండస్ట్రీస్ సంస్థ తయారు చేసిన ‘మ్యాట్రిక్స్ పవర్ వాచ్’ సోలార్ ఎనర్జీని వాడుకుంటూ దానంతట అదే చార్జ్ అవుతుంది.
బాడీ హీట్ నుంచి కూడా ఇది చార్జ్ అవుతుందని కంపెనీ చెప్పింది. దీంతో చార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ ఉండదు. ఈ స్మార్ట్‌వాచ్‌లో రిఫ్లెక్టివ్ కలర్ స్క్రీన్, 200 మీటర్ వాటర్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, స్టెప్ కౌంటర్, జీపీఎస్ వంటి ఫీచర్లున్నాయి. ధర సుమారు రూ.35,000.