
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌వర్క్స్ కో–వర్కింగ్ స్పేసెస్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో 2.20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకోవడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. దీంతో హైదరాబాద్‌లో కంపెనీకి మొత్తం పది లక్షల చదరపు అడుగుల జాగా అందుబాటులోకి వచ్చింది.
డీఎల్ఎఫ్ సైబర్ సిటీలోని బ్లాక్ 3లో ఈ ఆఫీస్ స్థలం ఉంది. స్మార్ట్‌వర్క్స్‌కు ఇది వరకే రాయదుర్గం, కొండాపూర్, మాదాపూర్‌లో ప్రాపర్టీలు ఉన్నాయి. స్మార్ట్‌వర్క్స్ ఇటీవల గురుగ్రామ్‌లో 4.7 లక్షల చదరపు అడుగుల జాగాను కొనుగోలు చేసింది.