ఐదేళ్లలో 20 లక్షల జాబ్స్​ ఇవ్వనున్న ఎస్​ఎంబీలు

ఐదేళ్లలో 20 లక్షల జాబ్స్​ ఇవ్వనున్న ఎస్​ఎంబీలు

న్యూఢిల్లీ: లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా 20 లక్షల జాబ్స్​ అందుబాటులోకి రానున్నాయి. మనదేశంలోని స్మాల్​మీడియం కంపెనీలు/ఎంటర్​ప్రైజెస్​లు​ (ఎస్​ఎంబీలు) పెద్ద ఎత్తున ఉపాధి కల్పించనున్నాయి. వీటిలో ఇన్నోవేషన్లకు అపారమైన అవకాశాలు ఉంటాయి.  బిజినెస్​ వేగంగా పెరుతుంది కాబట్టి కెరీర్​ కూడా బాగుంటుంది. అందుకే ఇలాంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని అమెరికాకు చెందిన జాబ్ పోర్టల్ ఇండీడ్​ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్  జనరల్ మేనేజర్ రాజ్ ముఖర్జీ చెప్పారు. ఈ సంస్థల్లో పనిచేయడం ద్వారా ఫ్రెషర్లు కొత్త విషయాలను నేర్చుకోవచ్చని, జీవితంలో పైకి ఎదగడానికి ఎన్నో అవకాశాలు దొరుకుతాయని చెప్పారు.  ఇండీడ్​ రీసెర్చ్​రిపోర్టు ప్రకారం... ఎస్​ఎంబీలలో ఏం జాబ్స్​ కావాలన్న ప్రశ్నకు  దాదాపు 39 శాతం మంది జాబ్​సీకర్లు ఐటీ జాబ్స్​అని జవాబు ఇచ్చారు. ఇతర రంగాలలో హాస్పిటాలిటీ,  ఫుడ్-24 శాతం, తయారీ-20 శాతం, బ్లూ కాలర్ జాబ్స్​-18 శాతం ఉన్నాయి. “ఎస్​ఎంబీలు ఆన్‌‌‌‌లైన్‌‌లోకి మారడంతో ఐటీ ఎక్స్​పర్టుల అవసరం చాలా ఉంటుంది. వీరిని పెద్ద ఎత్తున నియమించుకోవాలి. జాబ్స్​ఫ్లెక్సిబిలిటీ, లొకేషన్,  కెరీర్ గ్రోత్​కు ఉన్న జాబ్స్​ను ఈతరం వాళ్లు ఇష్టపడుతున్నారు. ఈ ధోరణి ఇక నుంచి కూడా కొనసాగుతుంది. స్థూల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది ”అని ముఖర్జీ అన్నారు.

ఇన్​ఫ్లేషన్​తో ఇబ్బంది లేదు..

ఇన్​ఫ్లేషన్ (ధరల పెరుగుదల)​ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ 60 శాతం మంది జాబ్​సీకర్లకు  (ఇండీడ్​ పోర్టల్‌‌లో రిజిస్టర్​అయినవారు) దీని వల్ల ఇబ్బందులు ఎదురుకాలేదు. సులువుగానే జాబ్​ దొరికింది. ఇన్​ఫ్లేషన్​​ వల్ల వ్యాపారాలపై ఎంతో కొంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ హైరింగ్​ను ఆపేయబోమని 89 శాతం మంది యజమానులు (కంపెనీ పోర్టల్) అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం శాశ్వతంగా ఎప్పుడూ ఉండదు.  మహమ్మారి అనంతరం ఇది వేగంగా పుంజుకుంది. 2022లో అనేక దేశాల్లో జాబ్ పోస్టింగ్‌‌లు  నెమ్మదించిప్పటికీ, భారతదేశంలో ఇలాంటి పరిస్థితి లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ  వెబ్‌‌సైట్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 9.57 శాతంగా ఉంది.  అయినప్పటికీ ఇండియాలో ఉద్యోగాల సంఖ్య భారీ తగ్గకపోవచ్చని ఇండీడ్​ అంచనా వేసింది. మందగమనం మరో మూడు- నుంచి ఆరు నెలల పాటు కొనసాగితే మాత్రం నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని,  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి వెళితే ప్రతి ఒక్కరిపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని ముఖర్జీ అన్నారు.

కొలువులకు కొరత లేదు

ఇండియాలో ప్రస్తుత పారిశ్రామిక పరిస్థితులు నిరుద్యోగులకు అనుకూలంగా మారాయి. ప్రొఫెషనల్​ జాబ్స్​కు డిమాండ్​ బాగుంది. జాబ్స్​ తొందరగా వస్తున్నాయి.  వర్క్​​ ఫ్లెక్సిబిలిటీ, తక్కువ గంటలు పనిచేసే అవకాశాలు ఉండటం వంటివి ఉద్యోగులు ఇష్టపడుతున్నారు.  ఎస్​ఎంబీలు మనుగడ సాగించాలంటే నిరంతరం మారుతున్న  జాబ్​సీకర్స్​ డిమాండ్లకు  మారకతప్పదని ఇండీడ్​ స్పష్టం చేసింది. దీని డేటా ప్రకారం ఈ ఏడాది. ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో ఎఫ్​ఎంసీజీ రంగంలో నియామకాలు  69 శాతం ఉన్నాయి. తయారీ, ఇంజనీరింగ్  మౌలిక సదుపాయాలు - 66 శాతం జాబ్స్​ను,  లాజిస్టిక్స్ - సెక్టార్​ 45 శాతం జాబ్స్​ను ఇచ్చింది. మొదటిసారి ఉద్యోగాలు దరఖాస్తుదారుల విషయానికొస్తే, 34 శాతం మంది ఐటీ/ఐటీఈఎస్​ సెక్టార్​లో ఉద్యోగాలను ఇష్టపడతామని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్​లో పనిచేయడాన్ని -29 శాతం మంది కోరుకున్నారు. తయారీ, ఇంజనీరింగ్,  మౌలిక సదుపాయాల రంగంవైపు -23 శాతం మంది చూస్తున్నారు. బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​సర్వీసెస్​ఇన్సూరెన్స్​  సెక్టార్​ జాబ్​​చేయడం ఇష్టమని - 21 శాతం మంది చెప్పారు.