
- ఎస్‌ఎండీసీ జీఎం చౌరాసియా
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : 2030 వరకు 300 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసే దిశగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ జీఎం చౌరాసియా పేర్కొన్నారు. సోమవారం గీతం డీమ్డ్ యూనివర్శిటీ, ఎలక్ర్టికల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో 'ఐవోటీ అప్లికేషన్లలో వీఎల్ఎస్ఐ కోసం అవకాశాలు -సవాళ్లు' అనే అంశంపై ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ప్రారంభమైంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలిలోని ఏటీఏఎల్అకాడమీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చౌరాసియా ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్ఎండీసీ పర్యావరణ అనుకూల మైనింగ్ పద్దతులకు కట్టుబడి ఉందని, ఆస్ర్టేలియాలోని ఎగసీ గోల్డమైన్తో కలిసి మధ్యప్రదేశ్లోని పన్నాలో బంగారం వెలికితీత పనులు ప్రారంభించామని తెలిపారు. గీతం, ఎన్ఎండీసీ మధ్య సహకారం ఎళ్లప్పుడూ కొనసాగుతందని వెల్లడించారు. కోర్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్ర్తీ, డాక్టర్ సుమన్లతా త్రిపాఠి, డాక్టర్ దుర్గేశ్నందినీ, మంజునాథచారి పాల్గొన్నారు.