స్మితా శ్రీవాస్తవ.. ఆమె జుట్టు ఆమె కన్నా పొడవు.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు చెందిన తన పొడవాటి కురులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఆమె జుట్టు పొడవు 7 అడుగుల 9 అంగుళాలు. సంగం నగరంలోని అల్లాపూర్ ప్రాంతానికి చెందిన స్మిత శ్రీవాస్తవ(46) .. 14 ఏళ్ల వయస్సు నుంచి జుట్టు పెంచుతోంది. ఆమె తల్లి ప్రోత్సాహంతో తన జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు జాగ్రత్తలు పాటిస్తూ రికార్డుల్లోకి ఎక్కింది. నవంబర్ 29 న తన పేరు అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చేరిందని స్మిత శ్రీవాస్తవ చెప్పారు. 

స్మిత శ్రీవాస్తవ 1980 నుంచి తన పొడవాటి అందమైన జుట్టు ను కలిగి ఉంది. హిందీ సినీ నటులను అనుకరించేదానిని స్మిత చెపుతున్నారు. 2001లో వ్యాపారి సుదేష్ శ్రీవాస్తవను వివాహం చేసుకున్న స్మిత యాన్సియంట్ హిస్టరీలో ఎంఏ పట్టా పొందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. 

ఇంత పొడవైన అందమైన జుట్టు సంరక్షణకు ఎలా చేశారు.. ఇన్నేళ్లుగా ఎలా మెయింటెన్ చేస్తున్నారని స్మిత ను అడిగితే ఇలా సమాధానం చెపుతున్నారు. బ్యూటీ పార్లర్ సహాయం లేకుండా తన పొడవాటి కురులను మెయింటెనెన్స్ చేస్తున్నానని స్మిత వెల్లడించింది. వారానికి రెండు వాష్ లు, అలోవేరా, రెండు గుడ్లు, అయోన్ లా 9(ఇండియన్ గూస్ బెర్రీ) , ఇతర సహజ పదార్థాలతో ఇంట్లో తయారు చేసిన పేస్ట్ తో నా జుట్టును జాగ్రత్త గా చూపుకుంటానని స్మిత సమాధానమిచ్చారు. పేస్ట్ ను అప్లయ్ చేసి సరిగ్గా శుభ్రం చేయడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుందని ఆమె చెబుతోంది. కడగడం, ఆరబెట్టడం, విడదీయడం, స్టైలింగ్ ప్రక్రియ మొత్తం రెండు గంటలకు పైగా పడుతుందని స్మిత చెప్పారు. 

స్మిత శ్రీవాస్తవకు తన జుట్టు అంటే ఎంతో అభిమానం.. అందుకు ఊడిన జుట్టును ప్లాస్టిక్ సంచికలో సేకరిస్తోంది. ఇలా 20 ఏళ్లుగా సేకరణ కొనసాగిస్తేంది. జీవితం మొత్తంలో రెండుసార్లు మాత్రమే జుట్టును ట్రిమ్ చేసుకున్నానని స్మిత చెప్పారు. ఒకటి తన పుట్టిన వెంట్రెకల సమయంలో, తన రెండో బిడ్డ పుట్టిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పుడు జుట్టు ట్రిమ్ చేశానని స్మిత శ్రీవాస్తవ వెల్లడిచింది.  ప్రయాగ్‌రాజ్ యొక్క స్మితా శ్రీవాస్తవ యొక్క పొడవాటి జుట్టు రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఏదీ ఏమైనా అంత పొడవాటి జుట్టును సుదీర్ఘ కాలం పాటు జాగ్రత్తగా పెంచడం అంటే మామూలు విషయం కాదు.. తనకు ఇష్ట మైన జుట్టు ఎట్టిపరిస్థితుల్లోకి కట్ చేయకుండా అలా పెంచినందుకు స్మిత శ్రీవాస్తవకు ఫలితం లభించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు కావడం గొప్ప విషయమే కదా. స్మిత శ్రీవాస్తవ కు కంగ్రాట్స్.