Steve Smith: గ్రౌండ్‌లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్

Steve Smith: గ్రౌండ్‌లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగుతాడు.  ఓ వైపు బ్యాటింగ్, మరో వైపు బౌలింగ్, ఇంకో వైపు ఫీల్డింగ్ లో అదరగొడతాడు. అతను మైదానంలో కనిపిస్తే ప్రత్యర్థులకు ఏ రకంగా ప్రమాదకరంగా మారతాడో చెప్పలేం. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ గా అతడు నిర్వచనం. జడేజా అంటే ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బయపడుతున్నాడు. అతను ఎంత ప్రమాదమో చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ముందు ఈ లెఫ్టర్మ్ స్పిన్నర్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
 
"జడేజా చాలా మంచి ఆటగాడు కాబట్టే మైదానంలో నాకు చిరాకు కలుగుతుంది. అతను ఎప్పుడూ పరుగులు చేయడం, వికెట్లు తీయడం, గ్రేట్ క్యాచ్ లు అందుకుంటూ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిస్తాడు. కొన్నిసార్లు నాకు ఇది చికాకు కలిగిస్తుంది.”అని స్టార్ స్పోర్ట్స్‌తో స్మిత్ అన్నాడు. జోష్ హేజిల్‌వుడ్ సైతం స్మిత్ సమాధానాన్ని సమర్ధించాడు. తాను కూడా స్మిత్ చెప్పినట్టుగానే చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో జడేజాపై స్మిత్ కు చెత్త రికార్డ్ ఉంది. టెస్ట్, వన్డేల్లో ఎన్నోసార్లు ఈ ఆసీస్ స్టార్ బ్యాటర్ ను బోల్తా కొట్టించాడు.

Also Read : నా కూతురిపై షమీ ప్రేమ అబద్ధం

ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జడేజాతో స్మిత్ సమరం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జడేజా న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో ఆల్ రౌండ్ షో తో మెప్పించిన జడేజా.. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు స్మిత్ తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ ఆడాడు. అతను ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు.