జన్మభూమి ఎక్స్ ప్రెస్ బోగీ నుంచి పొగలు

నల్గొండ అర్బన్​, వెలుగు : లింగంపల్లి నుంచి విశాఖపట్నం బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్  నల్గొండ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ వద్దకు చేరుకోగానే డీ6 కంపార్ట్ మెంట్ నుంచి పొగలు వచ్చాయి. గుర్తించిన రైల్వే సిబ్బంది 20 నిమిషాల పాటు అక్కడి రైల్వే ఫ్లాట్ ఫాంపైనే రైలును నిలిపివేశారు. రైల్వే కంపార్ట్ మెంట్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురై కిందికి దిగారు.

అధికారులు తనిఖీ చేసి సమస్యను పరిష్కరించారు. దీంతో ట్రైన్  విశాఖపట్నం బయలుదేరింది. కాగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కు 9 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సిన ట్రైన్   నల్గొండలో నిలిచిపోవడంతో 30 నిమిషాలు ఆలస్యమైంది.