
చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్దకు రాగానే బి-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. పొగలను చూసి ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ తెలిపారు.
దీంతో కావలి రైల్వే స్టేషన్‌లోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు నిర్వహించిన తర్వా్త రైలు కావలి నుంచి బయలుదేరింది.