
ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలకు కొదువ లేదు. ప్రతీ రోజూ..ఎక్కడో ఓ చోట..ఏదో ఓ వింత వెలుగులోకి వస్తూనే ఉంటుంది. తాజాగా తెలంగాణలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వింత ఘటన తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంఖిడి మండలం కిరిడి గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది.
ఓ రైతు తన పొలంలో గుంతలు తవ్వుతుండగా భూమిలో నుంచి పొగలు వచ్చాయి. వెంటనే భయపడిపోయిన రైతు.. చుట్టుపక్కల వారిని పిలిచి చూపించాడు. వారు కూడా ఆశ్చర్యానికి గురయ్య్యారు. భూమిలో నుంచి పొగలు వస్తున్నాయన్న విషయం ఆ నోటా..ఈ నోటా పాకడంతో ఘటన స్థలానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఈ వింతను చూసేందుకు బారులు తీరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Smoke from the Earth in Asifabad district pic.twitter.com/oUM9Y2tMOR
— Prashanth (@itzmibadboi) July 15, 2023