
ప్రయాణికులతో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి, ఈ ఘటన 2023 ఆగస్టు 13 ఆదివారం జనగామ స్టేషన్ సమీపంలో జరిగింది. ట్రైన్ బోగీలో పొగలు రావడం గుర్తిచిన సిబ్బంది లోకోపైలట్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న లోకోపైలట్ రైలును జనగామ స్టేషన్ దగ్గర నిలిపివేశారు. అప్పటికే ప్రాణ భయంతో వణికిపోతున్న ప్రయాణికులు బోగీల నుంచి కిందికి దిగి పరుగులు తీశారు.
అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్ తనిఖీలు చేపట్టింది. మరమ్మత్తులు చేసిన కాసేపటికే రైలు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోగలు ఎందుకు వచ్చాయన్న దానిపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.