- తొందరగా లంగ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం
- సర్వేలో తేల్చిన టెర్రిటరీ కేర్ సెంటర్
హైదరాబాద్, వెలుగు:ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇటీవల కాలంలో మహిళల్లో విపరీతంగా పెరిగిపోతోందని హైదరాబాద్ లోని టెర్రిటరీ కేర్ సెంటర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2011 నుంచి 2016 లోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన 446 మంది మహిళల్లో 53 శాతం మంది స్మోకింగ్ చేసేవాళ్లేనని తేలింది. అంతకు ముందు ఊపిరితిత్తుల క్యాన్సర్ రేషియోని పరిశీలిస్తే క్యాన్సర్ఉన్న 5 మంది పురుషులకు ఒక్క మహిళ బాధితురాలిగా ఉండేవారు. కానీ ప్రస్తుతం అది 2 : 1 కి చేరింది. లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం స్మోకింగ్ అని డాక్టర్లు చెబుతున్నారు. స్మోకింగ్ కారణంగా లంగ్ క్యాన్సర్ బారినపడుతున్న మహిళలంతా 40–60 ఏండ్ల లోపువారే. దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేయటంతోపాటు వాయు కాలుష్యం, మండే వాయువులు కారణాలుగా అధ్యయనంలో గుర్తించారు. దీనికితోడు స్మోకింగ్‌ను ఫ్యాషన్‌గా తీసుకుంటున్న యూత్ అడిక్ట్ అవుతున్నారని సర్వేలో వెల్లడైంది.
బతికేది 15 శాతం మందే
లంగ్స్ క్యాన్సర్ బారిన పడిన వారిలో సర్వైవల్ రేటు 15 శాతం మాత్రమే ఉంటోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేకపోవటం, క్యాన్సర్ ను గుర్తించడంలో లేట్ కావడం వల్ల ఇలా జరుగుతోందంటున్నారు డాక్టర్లు. డయాగ్నోసిస్ లో లోపాలు, లంగ్ క్యాన్సర్ లక్షణాలున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్యాన్సర్ ముదురుతోంది. దీంతో గుర్తించే సరికే ప్రమాదం 70% ఉంటోంది. క్యాన్సర్ విషయంలో చాలా మందికి అవేర్నెస్లేకపోవడమే క్యాన్సర్మరణాలు పెరిగేందుకు ప్రధాన కారణంగా తేల్చారు.
ప్రధాన కారణాలు
- పొగాకు ఎక్కువగా వాడటం
- సిగరెట్ స్మోకింగ్
- వాయు కాలుష్యం
- పోషకాహారలోపం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పొగాకును తీసుకోవడంపూర్తిగా మానేయటం
- రోజూ వ్యాయామం చేయటం
- వాయు కాలుష్యం నుంచితప్పించుకోవటం
- పండ్లు , కూరగాయలు ఎక్కువ తీసుకోవడం