
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం దగ్గర స్మృతిఇరానీ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లారెన్స్
మరోవైపు తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ కూడా దర్శించుకున్నారు . ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తన పుట్టిన రోజున శ్రీనివాసుడి ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు లారెన్స్. భక్తులు కోరిన కోర్కెలు అన్ని నేరవేర్చాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు.