
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani)మళ్లీ టీవీల్లోకి రానుంది. భారత రాజకీయాల్లో తిరుగులేని చక్రం తిప్పిన స్మృతి ఇరానీ తిరిగి నటిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఓ సిరీస్ కోసం వర్క్ చేయనున్నారంటూ, అందుకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి తాను నటించనున్న సిరీస్ ఏంటీ? రీ ఎంట్రీ ఎలా ఉండనుందో వివరాలు తెలుసుకుందాం.
స్మృతి ఇరానీ:
లేటెస్ట్గా ఫేమస్ బాలీవుడ్ దర్శక నిర్మాత ఏక్తా కపూర్ (Ektaa Kapoor), బీజేపీ నాయకురాలు, టెలివిజన్ నటి స్మృతి ఇరానీని తీసుకొస్తున్నట్లు హింట్ ఇచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో..ఏక్తా ఆర్ కపూర్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ రీబూట్ కోసం సిద్ధంగా ఉందని తెలిపింది. రీబూట్ సిరీస్ 150 ఎపిసోడ్‌ల వరకు ఉంటుందని వెల్లడించింది. అంతేకాకుండా, "మేము రాజకీయాలను వినోదంలోకి తీసుకువస్తున్నాము" అని తెలిపింది. ఇన్ డైరెక్ట్గా నటి స్మృతి ఇరానీ కూడా తిరిగి రావచ్చని హింట్ ఇచ్చింది.
తులసి విరానీగా, స్మృతి ఇరానీ తిరిగి వస్తున్నట్లు ఏక్తా కపూర్ హింట్ ఇవ్వడంతో.. ఇపుడీ ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. టీవీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై 2025జూన్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ:
ఏక్తా కపూర్ రూపొందించిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’అనే సీరియల్‌లో నటించిన స్మృతి ఇరానీకి మంచి గుర్తింపు ఉంది. ఈ సీరియల్ ఆమెకు నటిగా ఎంతగానో గుర్తింపు తెచ్చి పెట్టింది. 2000 నుంచి 2008 వరకూ ఈ సీరియల్ సక్సెస్ ఫుల్గా కొనసాగింది. ఇందులో స్మృతి.. తులసి అనే గృహిణి పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. కాగా, ఇప్పుడీ సీరియల్‌ను సిరీస్‌గా సిద్ధం చేయాలని ఏక్తా కపూర్ భావిస్తున్నారట.
ఏక్తా కపూర్:
దర్శక నిర్మాత ఏక్తా కపూర్ కి ఆర్ట్స్ అండ్ టీవీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉంది. ఏక్తా కపూర్ టెలివిజన్ పరిశ్రమలో.. మార్కెట్ లీడర్‌షిప్‌తో పాటు భారతదేశపు అగ్రశ్రేణి ఎంటర్‌టైన్‌మెంట్లో షోస్ నిర్మిస్తున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌తో ఇండియా వైడ్గా ఆడియన్స్ను సొంతం చేసుకున్నారు.
ఇటీవలే న్యూయార్క్లో 2023 నవంబర్ 20న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్థుల (International Emmy Awards) వేడుకలో ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ (International Emmys Directorate Award)అవార్డు కూడా వరించింది. టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ గల ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు.