- ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇండియా టీమ్ ప్రకటన
న్యూఢిల్లీ : సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే ఇండియా విమెన్స్ టీమ్‌ను స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నడిపించనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ సోమవారం టీమ్‌ను ప్రకటించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్టార్ పేసర్ రేణుక ఠాకూర్‌కు రెస్ట్ ఇచ్చింది. మంధానకు కెప్టెన్సీ, దీప్తి శర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపు కొనసాగించింది. కాగా, ఐర్లాండ్‌తో మూడు వన్డేలు వరుసగా 10, 12, 15వ తేదీల్లో రాజ్‌కోట్ వేదికగా జరుగుతాయి
ALSO READ : Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
ఇండియా టీమ్: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (కీపర్), రిచా ఘోష్ (కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టిటాస్ సాధు , సైమా ఠాకూర్, సయాలీ సత్ఘారే.