Smriti Mandhana: ఏడాదిలో నాలుగోది.. ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన మంధాన

బుధవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన(105) సెంచరీతో అలరించింది. మొదటి రెండు గేమ్‌ల్లో రెండంకెల స్కోరును చేరుకోవడంలో విఫలమైన ఈ ఓపెనర్.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో శతకం బాదింది. 299 పరుగుల భారీ ఛేదనలో 109 బంతుల్లో 105 పరుగులు చేసి మ్యాచ్‍పై ఆశలు రేకెత్తించింది.

ఈ శతకంతో మంధాన పలు రికార్డులు బద్దలు కొట్టింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, ఆస్ట్రేలియన్లపై బహుళ వన్డే సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌.. మంధాన. స్మృతికి ముందు, కేవలం ముగ్గురు భారత మహిళా క్రికెటర్లు మాత్రమే ఆస్ట్రేలియాపై వన్డే ఇన్నింగ్స్‌లో 100 పరుగుల మార్కును చేరుకున్నారు. కానీ రెండోసారి ఎవరూ ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయారు.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో సెంచరీలు బాదిన భారత మహిళలు

  • స్మృతి మంధాన: 2
  • హర్మన్‌ప్రీత్ కౌర్: 1
  • పూనమ్ రౌత్: 1
  • జయ శర్మ: 1

అదే సమయంలో మంధాన మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిల జాబితాలో టాప్ 5లోకి ప్రవేశించింది. ఆసీస్ మాజీ ఓపెనర్ మెగ్ లానింగ్ అగ్రస్థానంలో ఉన్నారు.

ALSO READ | Dinesh Karthik: ఇప్పటికీ బుమ్రా తర్వాత అతడే భారత బెస్ట్ బౌలర్: దినేష్ కార్తీక్

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్లు

  • మెగ్ లానింగ్: 15 సెంచరీలు (102 ఇన్నింగ్స్‌లు)
  • సుజీ బేట్స్: 13 సెంచరీలు (160 ఇన్నింగ్స్‌లు)
  • టామీ బ్యూమాంట్: 10 సెంచరీలు (113 ఇన్నింగ్స్‌లు)
  • స్మృతి మంధాన: 9 సెంచరీలు (91 ఇన్నింగ్స్‌లు)
  • నటాలీ స్కివర్-బ్రంట్: 9 సెంచరీలు (98 ఇన్నింగ్స్‌లు)