భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి దూకుడైన ఆట తీరుతో చెలరేగుతుంది. దీనికి తోడు మహిళా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం.. జెర్సీ నెంబర్ 18 కావడంతో ఫ్యాన్స్ ఆమెను కోహ్లీతో పోలుస్తూ ఉంటారు. తాజాగా మంధాన మరోసారి తనకు విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న పోలికలను కొట్టిపారేసింది. విరాట్ కోహ్లీని తనతో పోల్చవద్దని అభిమానులని మీడియాను కోరింది.
"విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. భారత క్రికెట్‌కు అతడు సాధించిన ఘనతలు అద్భుతం. నేను 18వ నెంబరు జెర్సీ ధరించినంత మాత్రాన అతనితో నన్ను పోల్చవద్దు. అలాంటి పోలికలు నాకు నచ్చవు". అని మంధాన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్మృతి మంధాన భారత మహిళల జట్టుకు వైస్ కెప్టెన్ గా ఓపెనర్ గా జట్టులో కొనసాగుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈమె కోహ్లీ తరహాలోనే రికార్డులు సృష్టిస్తుంది.
ఈ సంవత్సరం టాప్ రేంజ్ లో స్మృతి ప్రదర్శన ఉంది. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదింది. అదే ఫామ్ ను కొనసాగిస్తూ చెన్నై వేదికగా జరిగిన ఏకైక టెస్టుల్లో 149 పరుగులు చేసింది. ఇందుకు గాను జూన్ నెలలో ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ను గెలుచుకుంది. తాజాగా ముగిసిన ఆసియా కప్ లోను పరుగుల వరద పారించింది.
Smriti Mandhana on comparison with Virat Kohli
— SportsTiger (@The_SportsTiger) August 10, 2024
📷: BCCI#IPL2025 #viratkohli #SmritiMandhana #T20Cricket pic.twitter.com/J6LxYxnw6w