2024 ఏడాదికిగాను ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన గెలుచుకుంది. అలాగే, ‘ఉమెన్స్ టీ20 ఆల్‌స్టార్ ఎలెవన్ టీమ్’కూ ఎంపికైంది. 2024 వన్డేల్లో మంధాన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. జూన్‌లో దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలు బాదింది. 2024లో మొత్తం 13 ఇన్నింగ్స్‌ల్లో 747 పరుగులు చేసి 2024 క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన మహిళగా నిలిచింది.
ALSO READ | Jasprit Bumrah: గాయంతో న్యూజిలాండ్‌కు బుమ్రా.. సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు సజీవం
2024 వన్డేల్లో మంధాన యావరేజ్ 57.86 కాగా.. ఆమె స్ట్రైక్ రేట్ 95.15గా ఉంది. లారా వోల్వార్డ్ట్ (697), టామీ బ్యూమాంట్ (554), వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన (105) సెంచరీతో అలరించింది. ఈ శతకంతో మంధాన పలు రికార్డులు బద్దలు కొట్టింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, ఆస్ట్రేలియన్లపై రెండు సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.
SMRITI MANDHANA - ICC WOMEN'S ODI CRICKETER OF THE YEAR. 🇮🇳 pic.twitter.com/CID0LawNCM
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2025