ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన టాప్-4లోకి దూసుకొచ్చింది. 743 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ(769 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన తహ్లియా మెక్‌గ్రాత్(762 పాయింట్లు) రెండో స్థానంలో, వెస్టిండీస్ బ్యాటర్ హేలీ మాథ్యూస్(746 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్‌లో మంధాన అద్నుతంగా రాణించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో స్మృతి హాఫ్ సెంచరీతో అలరించింది. టోర్నీ మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 57.67 సగటు, 137.3 స్ట్రైక్ రేట్‌తో 173 పరుగులు చేసింది. తద్వారా ఒక స్తానం మెరుగు పరుచుకొని నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు, వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మంధాన నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Several key players standing up at the Women's Asia Cup, but Sri Lanka's captain in a class of her own 👋
— ICC (@ICC) July 30, 2024
More 👉 https://t.co/f9tmDUEXmF pic.twitter.com/Eo5YXZr3cA
రేణుకా సింగ్
ఇక టీ20 బౌలర్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ మూడో స్థానాన్ని నిలుపుకోగా.. రేణుకా సింగ్(722 పాయింట్లు) నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో ఇంగ్లీష్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్(772 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది.