మంధాన, దీప్తి మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోనే

మంధాన, దీప్తి మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోనే

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ.. ఐసీసీ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంధాన  (753 పాయింట్లు) ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పులేదు. కెప్టెన్‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (628) ఒక్క ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగబాకి సంయుక్తంగా పదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. 

జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (619), షెఫాలీ వర్మ (617) వరుసగా 15, 16వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. బెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూనీ (798), తహ్లియా మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (756) వరుసగా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (728) ఒక ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగజారి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (664) ఒక్క స్థానం మెరుగుపడి 15వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (756), సాదియా ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (746) వరుసగా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు.