ఐసీసీ వన్డే బ్యాటింగ్‌‌ ర్యాంకింగ్‌లో‌ మంధాన దూకుడు

ఐసీసీ వన్డే బ్యాటింగ్‌‌ ర్యాంకింగ్‌లో‌ మంధాన  దూకుడు

దుబాయ్‌‌ : ఇండియా విమెన్స్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే బ్యాటింగ్‌‌ ర్యాంకింగ్‌‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదలైన తాజా జాబితాలో మంధాన (738 పాయింట్లు) ఒక్క ప్లేస్‌‌ మెరుగై రెండో ర్యాంక్‌‌కు చేరుకుంది. ఐర్లాండ్‌‌తో సిరీస్‌‌లో 135, 41, 73 రన్స్‌‌ చేయడం మంధాన ర్యాంక్‌‌ మెరుగవ్వడానికి దోహదం చేసింది. టాప్‌‌–10లో ఇండియా నుంచి మంధాన మినహా మరెవరికీ చోటు దక్కలేదు. 

సౌతాఫ్రికా బ్యాటర్‌‌ లారా వోల్‌‌వర్త్‌‌ (773) టాప్‌‌ ర్యాంక్‌‌లో ఉండగా, శ్రీలంక ప్లేయర్‌‌ చామిరి ఆటపట్లు (733) మూడో ర్యాంక్‌‌లో కొనసాగుతోంది. ఇండియా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌, జెమీమా రొడ్రిగ్స్‌‌ వరుసగా 15, 17వ ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. ఆల్‌‌రౌండర్స్‌‌ లిస్ట్‌‌లో దీప్తి శర్మ (344) ఆరో ర్యాంక్‌‌లో ఉంది. బౌలింగ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో దీప్తి శర్మ (680)  ఐదు నుంచి  నాలుగో ప్లేస్‌‌కు చేరుకుంది.