
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణిస్తుంది, బ్యాటింగ్ బౌలింగ్ లో అసాధారణంగా రాణిస్తూ జట్టుకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తుంది. సహచర ప్లేయర్లు విఫలమైనప్పటికీ పెర్రీ ఒంటరి పోరాటం చేస్తుంది. సోమవారం ( ఫిబ్రవరి 24) జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ పై 90 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించింది. బౌలింగ్ లోనూ రాణించి రెండు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది.
పెర్రీ మినహాయిస్తే మిగిలినవారు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యూపీ వారియర్స్ షాకిచ్చింది. టోర్నీ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి చెక్ పెట్టి యూపీ వారియర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్‌లో యూపీ 8/1 స్కోరు చేయగా, ఆర్‌సీబీ 4/0 స్కోరుకే పరిమితమై ఓడింది. గాయం కారణంగా సూపర్ ఓవర్ లో పెర్రీ బ్యాటింగ్ కు రాకపోవడం బెంగళూరు విజయావకాశాలను దెబ్బ తీసింది. దీంతో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఎమోషనల్ అవుతూ పెర్రీకి క్షమాపణలు తెలిపింది.
Also Read:-మనం గెలవటానికి క్షుద్ర పూజలు చేశామంట..!
"పెజ్ మహిళా క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరు. ఆమె బ్యాటింగ్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. జట్టు కోసం ఆమె ఎంతగానో పోరాడింది. ఒక జట్టుగా ఆమెకు క్షమాపణ చెప్పాలి. పెర్రీ అద్భుతంగా ఆడిన ఈ మ్యాచ్ గెలవలేకపోయాం. ఈరోజు ఓడిపోయిన జట్టులో ఉండటం నిరాశపరిచింది. మా జట్టు కొంచెం ఒత్తిడిలో ఉంది. బలహీనతలపై దృష్టి పెట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం". అని మ్యాచ్ తర్వాత మంధాన ప్రెజెంటేషన్ లో చెప్పింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. ఎలైస్ పెర్రీ (56 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 నాటౌట్) దంచికొట్టగా, డ్యానీ వ్యాట్ (57) హాఫ్ సెంచరీతో అండగా నిలిచింది. ఛేజింగ్‌లో యూపీ 20 ఓవర్లలో సరిగ్గా180 రన్స్‌కు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్ (19 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 33), శ్వేత (31), దీప్తి శర్మ (25), కిరణ్ నవ్‌గిరె (24) కీలక భాగస్వామ్యాలు అందించారు. చివర్లో భారీ షాట్లతో విజృంభించిన ఎకిల్‌స్టోన్ ఆటను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది.
'Really have to tell Perry we are sorry. How could we not...': Smriti Mandhana's emotional apology to Australia's Ellyse after super over loss#RCBvsUPW #WPL2025 https://t.co/wNLA5W4ggZ
— Sports Tak (@sports_tak) February 25, 2025