WPL 2025: కోహ్లీ గురించి అనవసరం.. 18 నంబర్ జెర్సీపై స్మృతి మంధాన కామెంట్స్ వైరల్

WPL 2025: కోహ్లీ గురించి అనవసరం.. 18 నంబర్ జెర్సీపై స్మృతి మంధాన కామెంట్స్ వైరల్

భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి దూకుడైన ఆట తీరుతో చెలరేగుతుంది. దీనికి తోడు మహిళా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం.. జెర్సీ నెంబర్ 18 కావడంతో ఫ్యాన్స్ ఆమెను కోహ్లీతో పోలుస్తూ ఉంటారు. తాజాగా మంధాన మరోసారి తనకు విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న పోలికలను కొట్టిపారేసింది. విరాట్ కోహ్లీని తనతో పోల్చవద్దని అభిమానులని.. మీడియాను కోరింది. ఈ సందర్భంగా జెర్సీ నెంబర్ 18 పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

2025 మహిళల ప్రీమియర్ లీగ్ ఎడిషన్ నేటి శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో నేడు డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు.. గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు మంధాన మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా కోహ్లీతో 18 నంబర్ జెర్సీని ధరించడం పట్ల మీ రియాక్షన్ ఏంటి అని అడిగాడు. దీనికి మంధాన కిందకి చూస్తూ చిన్నగా నవ్వింది. "డబ్ల్యూపీఎల్‌‌‌‌ గురించి మాట్లాడటానికి మేము ఇక్కడ ఉన్నాము. కాబట్టి మహిళల క్రికెట్‌ గురించే మాట్లాడుకుందాం". అని సమాధానమిచ్చింది. స్మృతి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 

ఈ టోర్నీ విషయానికి వస్తే.. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ఐదు జట్లతోనే లీగ్‌‌‌‌ను నిర్వహిస్తున్నారు. మార్చి 15 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి. అయితే లీగ్‌‌‌‌ను మరిన్ని ప్రదేశాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా వడోదరా, లక్నోలను వేదికలుగా చేర్చింది. ఫార్మాట్​లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రతి జట్టు హోమ్‌‌‌‌ అండ్‌‌‌‌ అవే పద్ధతిలో ఇతర జట్లతో రెండుసార్లు తలపడుతుంది.

లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో టేబుల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా నిలిచిన జట్టు డైరెక్ట్‌‌‌‌గా ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది. ఇందులో నెగ్గిన టీమ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు వెళ్తుంది. లీగ్‌‌‌‌ దశలో ఆడే తొలి ఆరు మ్యాచ్‌‌‌‌లకు వడోదరా ఆతిథ్యమిస్తుంది. తర్వాత ఎనిమిది మ్యాచ్‌‌‌‌లు బెంగళూరులో, లక్నోలో నాలుగు మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి. చివరి నాలుగు మ్యాచ్‌‌‌‌లు ముంబైలోని సీసీఐలో ఆడనున్నారు.