లక్నో: మహా కుంభమేళా పుష్కరాల్లో స్నానం చేస్తే.. చేసిన తప్పులకు మోక్షం లభిస్తోందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తారు. పుష్కర జలాల్లో మునిగి తమ తప్పులను క్షమించాలని భగవంతున్ని ప్రార్థిస్తుంటారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ఈ విశ్వాసాన్ని నమ్మి పుష్కరాల్లో స్నానామాచరించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ నమ్మకమే ఓ క్రిమినల్ కొంపు ముంచింది.
ఎన్నో నేరాలకు పాల్పడిన ఓ స్మగ్లర్ పాప విముక్తి కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఫుణ్య స్నానానికి వెళ్తే అది కాస్తా రివర్స్ అయ్యింది. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ అండర్ గ్రౌండ్లో ఉన్న స్మగ్లర్ కుంభమేళాకు వచ్చాడు. స్మగ్లర్‌ను పట్టుకునేందుకు ఎంతో కాలంగా నిఘా పెట్టిన పోలీసులు కుంభమేళాలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పాపాలు కడుక్కోవాలని కుంభమేళాకు వస్తే.. పాత కేసుల్లో స్మగ్లర్ అరెస్ట్ అయిన ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ALSO READ | Viral Video: అయ్యోపాపం.. బడికి వెళ్లాలంటే.. రోప్ వేతో నది దాటాల్సిందే..
పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ప్రవేశ్ యాదవ్ మద్యం, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే 2023 జూలై 29న నేషనల్ హైవే-19 మీదుగా బీహార్‌కు అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా ప్రవేశ్ యాదవ్ ముఠా పోలీసులకు పట్టుబడింది. ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రవేశ్ యాదవ్ పారిపోయాడు. గత ఏడాదిన్నరగా ప్రవేశ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు.
ప్రవేశ్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. నిందితుడు ఆదివారం (జనవరి 27) కుంభమేళాలకు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు అలర్ట్ అయిన పోలీసులు.. ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు భదోహి పోలీస్ సూపరింటెండెంట్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు వివరించారు. చేసిన పాపాలకు మోక్షం కోసం వస్తే.. కుంభమేళాలోనే నిందితుడు పాపం పడిందంటూ నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.