ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో కలప స్మగర్లు రెచ్చిపోయారు. దామరవాయి అటవీప్రాంతంలో అర్థరాత్రి ముగ్గురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పై స్టీల్ రాడ్లతో దాడి చేశారు. అక్రమంగా చెట్లను తొలగించి జేసీబీతో భూమిని చదును చేస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది.
జేసీబీని సీజ్ చేసి తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా జేసీబీ యజమాని సూరజ్ రెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు . ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్ బీఓ శరత్ చంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జేసీబీని ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు. పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.