టార్చిలైట్​లో బంగారం స్మగ్లింగ్.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో  807 గ్రాములు సీజ్

శంషాబాద్, వెలుగు : అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్​పోర్టు కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. దోహా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న 
ఓ ప్యాసింజర్, బంగారాన్ని 12 ముక్కలుగా చేసి చార్జింగ్ టార్చిలైట్​లో దాచాడు.

స్కానింగ్​లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టార్చిలైట్​ నుంచి 807.10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.49.71 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.