ఇప్పటి ఉద్యోగులు ఆఫీస్‌కు రమ్మంటే బెదిరిస్తున్నారు.. మరోసారి వార్తల్లోకి ఎల్&టీ బాస్

ఇప్పటి ఉద్యోగులు ఆఫీస్‌కు రమ్మంటే బెదిరిస్తున్నారు.. మరోసారి వార్తల్లోకి ఎల్&టీ బాస్

ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌(SN Subrahmanyan).. ఈసారూ అందరికి సుపరిచితులే. కొన్నాళ్లక్రితం ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలనే దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ’ఇళ్లదగ్గరండి భార్యను ఎంతసేపని అలా చూస్తూ ఉండిపోతారు.. ఆదివారాలూ పనిచేయండి’ అని కఠిన మాటలు మాట్లాడి  వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. మళ్లీ కొన్నాళ్లపాటు కెమెరా కంట పడని ఈయన మరోసారి ఆ తరహా వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలో జరిగిన మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో పాల్గొన్న సుబ్రహ్మణ్యన్‌.. ఈసారి ఉద్యోగ వలసలు, ఉద్యోగుల ఆఫీసులకు తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంపై మరో వివాదాన్ని రేకెత్తించారు. ఇప్పటి ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రమ్మని చెప్తే.. రాజీనామా చేస్తామని బెదిరిస్తున్న విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. 

Also Read :-  లక్ష రూపాయల ఐ ఫోన్.. రూ.20 వేలకే కొనే ట్రిక్

1983లో తాను L&Tలో చేరిన నాటి పరిస్థితులు మరోలా ఉండేవని సుబ్రహ్మణ్యన్‌ అన్నారు. బాస్ ఏది చెప్తే ఉద్యోగులు అది పాటించేవారని అన్నారు. చెన్నై నుండి ఉద్యోగులను ఢిల్లీకి మకాం మార్చమన్నా.. లేదా ఢిల్లీ నుండి చెన్నైకి మకాం మార్చమన్నా దేనికైనా అంగీకరించేవారని అన్నారు. కానీ, ఈతరం ఉద్యోగుల తీరు వారు అనుకున్నట్లు నడుస్తోందని విమర్శించారు. ఉదాహరణకు ఐటీ ఉద్యోగి ఆఫీసుకు వచ్చి పని చేయమని చెబితే, అతను బై చెప్పి వెళ్లిపోతాడని అన్నారు. ఇది పూర్తిగా వేరే ప్రపంచం, తమాషా ప్రపంచం అని అభివర్ణించారు.