జన్నారం, వెలుగు : అనుకోకుండా నాగుపాము, ముంగిస ఎదురుపడితే భీకర పోరు జరుగుతుంది. ఇలాంటి ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం మహ్మదాబాద్– రోటిగూడ గ్రామాల మధ్య రోడ్డుపై ఎదురుపడ్డ పాము, ముంగిస తలపడ్డాయి.
దీంతో స్థానికులు వాటి పోరును ఆసక్తిగా చూశారు. చివరకు నాగుపాముపై పై చేయి సాధించిన ముంగిస నోట కరుచుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. పాము ముంగిస మధ్య జరిగిన ఫైటింగ్ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ గా మారాయి.