ఈరోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఏసీలు కామన్ అయిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఏసీ అనేది కంపల్సరీ అయింది. ఏసీ అతిగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు, వాతావరాణానికి హాని కలుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏసీ పాములు ఉండటం ఎప్పుడైనా చూశారా.. అవును నిజమే, పశ్చిమ గోదావరి జిల్లా గోపులాపురంలో ఓ ఇంట్లో ఏసీ క్లీన్ చేస్తుండగా పాము దర్శనమిచ్చింది.
ఏసీని క్లీన్ చేస్తుండగా లోపలి నుండి పాము బుసలు కొడుతున్న శబ్దం వినపడటంతో క్లీన్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తమై దాన్ని బయటికి తీశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ పామును అప్పటికప్పుడే చంపేశారు. ఏసీలు క్లీన్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది