గురుకుల స్టూడెంట్​కు పాముకాటు

పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని జ్యోతిబాపూలే గురుకుల స్కూల్ లో విద్యార్థిని పాము కరిచింది. శనివారం ఉదయం ఆరో తరగతి చదువుతున్న రాథోడ్ వంశీ పాము కాటుతో అస్వస్థకు గురయ్యాడు. ఆ బాలుడిని బిచ్కుందలోని హస్పిటల్​కు అక్కడి నుంచి నిజామాబాద్​కు తరలించారు.

పెద్దకొడప్​గల్ మండలం లచ్చిరాం తండాకు చెందిన రాథోడ్ తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇటీవల బీర్కూర్ ​హస్టల్​లోనూ స్టూడెంట్ ను పాము కరవడం, ఇప్పుడు బిచ్కుందలో స్టూడెంట్​ పాము కాటుకు గురి కావడంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వంశీ కోలుకుంటున్నాడని గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ భరత్ భూషణ్ తెలిపారు.