పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి
  • కరీంనగర్ జిల్లా తాడికల్ లో ఘటన

శంకరపట్నం, వెలుగు: పాము కాటుతో మహిళ మృతిచెందిన ఘటన కరీంనగర్​జిల్లాలో జరిగింది. కేశవపట్నం ఎస్ఐ రవి తెలిపిన ప్రకారం..  శంకరపట్నం మండలం తాడికల్ కు చెందిన వెంగళదేవి (41) గత సోమవారం బర్రెను మేపేందుకు తీసుకెళ్తుండగా.. ఆమెను పాము కరిచింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.  చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మృతురాలికి భర్త కుమార స్వామి, కూతురు, కొడుకు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.