అతను బతికే ఉన్నాడు.. పాము చచ్చిపోయింది.. కాటేసిందని కొరికి చంపాడు

అతను బతికే ఉన్నాడు.. పాము చచ్చిపోయింది.. కాటేసిందని కొరికి చంపాడు

పాము కాటుకు మనిషి కాటు విరుగుడు అయ్యింది. ఈ షాకింగ్ విషయం తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా పాము మిమ్మల్ని కరిస్తే మీరు ఏం చేస్తారు.? భయంతో అక్కడి నుంచి పారిపోతారు. డాక్టర్ దగ్గరకి పరిగెడతారు. కానీ జార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే కూలీ.. పాము కాటేస్తే తిరిగి పామునే మూడు సార్లు కరిచాడు. వింటానికి వింతాగా ఉంది కాదా.. బీహార్ రాష్ట్రం నవాడాలోని రాజోలు రైల్వే ప్రాజెక్ట్ లో పని చేయడానికి సంతోష్ వెళ్లాడు. జూలై 2న బేస్ క్యాంప్ లో నిద్రపోతుంటే.. పాము అతన్ని 2సార్లు కాటు వేసింది. 

కోపంతో వెంటనే సంతోష్ భయపడకుండా ఇనుప రాడ్ తో పామును పట్టుకొని తిరిగి కరిచాడు. ఒకసారి కాదు మూడుసార్లు పామును నోటితో కరిచాడు. పాము చనిపోయింది.. సంతోష్ బతికే ఉన్నాడు. తన గ్రామంలో పాము కాటేస్తే తిరిగి రెండు సార్లు పామును కరవాలనే నమ్మకం ఉందని సంతోష్ చెప్పాడు. అందుకే తాను అలా చేశానని తెలిపాడు. అనంతరం రైల్వే అధికారులు సంతోష్ ను హాస్పిటల్లో చేర్పించారు.