ఏంటయ్యా ఇదీ : సీఎం జగన్ పౌష్ఠికాహారం ఖర్జూరంలో చనిపోయిన పాము

ఏంటయ్యా ఇదీ : సీఎం జగన్ పౌష్ఠికాహారం ఖర్జూరంలో చనిపోయిన పాము

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం  కలకలానికి దారితీసింది.  ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్ వాడీ కేంద్రంలో చోటుచేసుకుంది.  మానస అనే గర్భిణి  అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. 

ALSO READ: చంద్రబాబుకు రిలీఫ్.. ఆ కేసులో ముందస్తు తాత్కాలిక బెయిల్ 

అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది.  దీంతో ఒక్కసారిగా అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు చెప్పామని, మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా గుత్తేదారును ఆదేశించామని పేర్కొన్నారు.