అయ్యబాబోయ్​ .. ఒకేచోట 102 పాములు.. పట్టుకున్న స్నేక్​ క్యాచర్​

అయ్యబాబోయ్​  .. ఒకేచోట 102 పాములు.. పట్టుకున్న స్నేక్​ క్యాచర్​

ఒక్క పాముని చూస్తేనే గుండె ఝల్లుమంటుంది. అలాంటిది ఇక్కడ ఒకేచోట ఏకంగా.. 102 పాములను పట్టుకున్నారు స్నేక్​ క్యాచర్స్​. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీ శివారులో ఉన్న ఒక గార్డెన్​లో చెట్లకు వేయడానికి రెడీ చేసిన మల్చ్​(ఆకులు, గడ్డితో తయారుచేసే ఒక రకమైన ఆర్గానిక్​ మెటీరియల్​)లో విషపూరిత పాము తిరుగుతున్నట్టు అక్కడివాళ్లు గమనించారు. దాంతో పాములు పట్టే డైలన్ కూపర్‌‌ను పిలిపించారు. 

అతను ఒక్క పాము కోసమని వెతికితే ఏకంగా అక్కడ 102 పాములు దొరికాయి. వాటిలో 5 పెద్ద పాములు 97 చిన్న పాములు ఉన్నాయి. ఈ విషపూరిత పాములను అక్కడివాళ్లు రెడ్​ బెల్లీ బ్లాక్‌‌ స్నేక్స్​ అని పిలుస్తుంటారు. వీటి అడుగు భాగంలో ఎర్రగా మిగతా శరీరమంతా నల్లగా ఉంటుంది.  సాధారణంగా చాలా పాములు గుడ్డు నుండి పొదిగి బయటకి వస్తాయి. ఈ రెడ్​ బెల్లీ పాములు మాత్రం గుడ్లు పెట్టకుండా గర్భాశయం నుంచి పాములకు జన్మనిస్తాయి. మనుషులు తిరగని అనువైన ఆవాసాలు ఎక్కడా దొరక్కపోవడంతో ఇలా గుంపుగా ఇక్కడికి వచ్చి మల్చ్​లో పిల్లలకు జన్మనిచ్చి ఉండొచ్చని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.