వారం రోజులుగా కురిసిన వర్షాలకు కొమరం భీం జిల్లా కౌటారం మండలం కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. టీచర్లు తెలిపిన వివరాల ప్రకారం... క్లాసు రూం లోనికి పాము జొరపడింది. దీనిని గమనించిన విద్యార్థులు బయటకు పరుగులుతీశారు. పాఠశాల చుట్టూ పంట పొలాలు ఉండటం.. చెట్లు. ఉండటం తో ఇటీవల కురిసిన వర్షాలకు పాములు చేరి ఉంటాయని స్కూలు సిబ్బంది చెబుతున్నారు. స్కూలు భవనము చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో తరగతి గదిలోనికి పాము వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలకు ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ALSO READ | శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్.. క్యాంపస్లో ట్రీట్మెంట్