Viral Video: అయ్య బాబోయ్ : నిద్రపోతున్న మహిళ కొప్పులో దూరిన పాము

Viral Video: అయ్య బాబోయ్ : నిద్రపోతున్న మహిళ కొప్పులో దూరిన పాము

పాము అనే మాట వినగానే భయపడతాం. ఎక్కడైనా పాము వెళ్ళిందని తెలిస్తే అటువైపు వెళ్ళను కూడా వెళ్ళం. ఈ మధ్య కాలం లో పాములు కారు బానెట్ లలోనూ, వాటర్ పైపులలోనూ, జనావాస ప్రాంతాల్లో తిరుగుతూ కాస్త భయపెడుతున్నాయి.  కాని ఈ వీడియోలో ఓ పాము నిద్రిస్తున్న  మహిళ తలలో పాకుతుంది.  ఈవీడియో ఇప్పుడు అందర్ని షాక్ కు గురి చేస్తోంది.

నిద్రిస్తున్న మహిళ జుట్టులో పాము పాకుతున్న వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. పాములు సాధారణంగా మనుషుల చుట్టూ ఉండవు, అవి గడ్డి భూములు, ఎలుక బొరియలు మొదలైన వాటిలో కనిపిస్తాయి. అయితే ఈ యువతి జుట్టులో పాము పాకుతున్న వీడియో చూస్తే నిజం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత పెద్ద పాము తన వెంట్రుకల్లోకి పాకుతున్నట్లు కూడా ఆమెకు తెలియదు. ఈ వీడియో ఎక్కడిదో తెలియదు, ఆమె నిద్రిస్తున్నప్పుడు ఆమె జుట్టులో పాము పాకుతూ కనిపిస్తుంది. ఆ యువతి పాముకు భయపడినట్లు లేదు.

kashikyatra అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి టేబుల్‌పై తల పెట్టుకుని పడుకుని ఉంది. ఆమె తన జుట్టును ముడి వేసుకుని క్లిప్ పెట్టుకుంది. అయితే ఆ జుట్టులో ఓ సన్నటి పాము ఉంది. అది కదులుతూ పైకి వెళుతోంది (Snake crawaling in hair). ఆ మహిళ జుట్టుకు పూర్తిగా చుట్టుకున్న పాము వెనుక వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీడియో చాలా మంది నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by kAshiKyaTrA (@kashikyatra)

సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన యూజర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. . ఇప్పటి వరకు 27 మిలియన్లు అంటే 27 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 26 వేల మంది వినియోగదారులు లైక్ చేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, వినియోగదారులు విభిన్న స్పందనలను ఇచ్చారు